Friday, 2 September 2022

Dhada Dhada Song Lyrics in Telugu

 

Dhada Dhada Song Lyrics in Telugu

చిత్రం:ది వారియర్
నటీనటులు:రామ్ పోతినేని, క్రితి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా మోయిదు
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:శ్రీమణి
గానం:హరిహరన్
దర్శకత్వం:ఎన్.లింగుసామి
పాట ప్రచురణ:ఆదిత్య మ్యూజిక్
నిర్మాణం:శ్రీనివాసా చిట్టూరి
చిత్ర విడుదల తేది:


దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నువ్వు విసిరినా విజిల్ పిలుపొక
గజల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే

తెలియదు కదా పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడు నేనే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నలుపని తెలిసి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే నీకై పొంగే
నా హృదయాన్నె మరి కసిరేస్తావే

ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తావే
ఎటు వెళ్లని వల వేస్తావే
ఏంచేశానంటూ నను నిలదీస్తావే
ఏం చేయలేక చూస్తూ ఉంటె జాలి చూపవే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం, హ హా
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇకడే ఉన్నావని అర్ధం

తేనెలో పడడం చీమకు ఇష్టం
నీ ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం

రాసిన రాతైనా మళ్ళీ రాస్తున్న
విసుగుండదు ఇది ఏం కవితో
రోజు చూస్తున్నా… మళ్ళీ వస్తున్న
నిను ఎంత చూడు కనులకసలు తనివి తీరదే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

14 జులై 2022

No comments:

Post a Comment

Lyrics songs website

So So Ga Song Lyrics In Telugu/సో సో గా సాంగ్ లిరిక్స్

  చిత్రం: మంచి రోజులొచ్చాయిసంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: కెకెగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్ద...